← Back to news

DSCపై 141 కేసులు.. అసెంబ్లీలో లోకేష్‌ వివరణ

By Mahesh· 17 Aug 2026· AP
DSCపై 141 కేసులు.. అసెంబ్లీలో లోకేష్‌ వివరణ

AP: అసెంబ్లీలో DSCపై మంత్రి నారా లోకేష్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. YSRCP నేతలు కావాలనే DSCపై కేసులు వేశారని, 141 కేసులు వేసినా అవేవీ కోర్టులో నిలబడలేదని అన్నారు. అత్యంత పారదర్శకంగా DSC నిర్వహించామని, TCS iON సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని ఇచ్చిన హామీతో తొలి ఏడాదే 16,347 పోస్టులతో DSC నిర్వహించామని చెప్పారు. గతంలోని 29 స్పోర్ట్స్‌ కేటగిరీలను 65కు పెంచామని, కేంద్ర నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్‌ కోటాను పెంచినట్లు లోకేష్‌ వివరించారు.

More in AP