← Back to news

బాధిపుట్టు స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఏకగ్రీవం!

By SINDERI KAMESH· 1d ago· Munchingiputtu, Munchingi Puttu, Alluri Sitharama Raju
బాధిపుట్టు స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఏకగ్రీవం!

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీలోని బాధిపుట్టు ఎంపీపీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. చైర్మన్‌గా వంతల మోహన్, వైస్ చైర్మన్‌గా పాంగి మణికుమారి ఎన్నికయ్యారు. నూతన కమిటీని మాజీ చైర్మన్ ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులతో కలిసి కృషి చేస్తామని కొత్త కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More in Local