← Back to news

నిలిచిపోయిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సేవలు !

By DS· 19 Jul 2026· ndtv
నిలిచిపోయిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సేవలు !

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాంతో వేలాది మంది వినియోగదారులు ఎక్కౌంట్లలో లాగిన్ అవ్వడానికి, కొత్త పోస్టులు పెట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌లలో సర్వర్ లోపం కారణంగానే ఈ టెక్నికల్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. యూజర్లు తమ సమస్యలను ఇతర సోషల్ మీడియా వేదికలలో పంచుకుంటూ అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

More in News