← Back to news

విద్యార్థుల్లో లీడర్‌షిప్ స్కిల్స్ పెంచేలా కార్యక్రమం

By kesharaju sai kumar· 1d ago· Khila Warangal, Khila Warangal, Warangal
విద్యార్థుల్లో లీడర్‌షిప్ స్కిల్స్ పెంచేలా కార్యక్రమం

గ్రేటర్ వరంగల్‌ 47వ డివిజన్‌లోని నారాయణ పాఠశాలలో విద్యార్థుల నేతృత్వ సమావేశం (Student Led Conference) నిర్వహించారు. కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల R&D ప్రతినిధి సంగీత, వరంగల్ జోనల్ DGM రిజ్వాన్ ఇమ్రాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు స్వయంగా తమ చదువు, ప్రగతి, ప్రాజెక్టులు, విజయాలను తల్లిదండ్రులకు వివరించడం కార్యక్రమం ప్రత్యేకతగా తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు.

More in Local