← Back to news

స్కూల్ కమిటీ ఎన్నికల్లో ఘర్షణ.. పలువురికి గాయాలు

By Sanddep Uppala· 1d ago· Nadendla, Nadendla, Palnadu
స్కూల్ కమిటీ ఎన్నికల్లో ఘర్షణ.. పలువురికి గాయాలు

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తిమ్మాపురంలో స్కూల్ కమిటీ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో పావులూరు పిచ్చయ్య, పావులూరు చంద్రశేఖర్, పావులూరు హనుమంతరావు, బిరుదు స్టీఫెన్‌తో పాటు మాదిగపల్లికి చెందిన మరికొందరు గాయపడ్డారు. గుంటూరు నుంచి కొంతమందిని తీసుకొచ్చి కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేశారని స్థానికులు ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని ఫైరయ్యారు.

More in Local