ఛీఛీ.. ఓపెన్ టాయిలెట్స్..!

బీహార్‌లోని సమస్తిపూర్‌లో తీవ్ర వరదలు వచ్చాయి. ప్రభావిత ప్రజల కోసం ప్రభుత్వం తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటుచేసింది. కానీ వాటికి గోడలు, తెరలు ఏవీ లేవు. ఓపెన్‌గా కమోడ్‌లు పెట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు, పిల్లలకు ప్రైవసీ లేకుండా ఇలాంటి సౌకర్యాలు ఎలా ఉపయోగపడతాయనే ప్రశ్నలొస్తున్నాయి. డిజాస్టర్ల టైంలో సౌకర్యాలు కల్పిస్తే సరిపోదు. అవి రెస్పెక్ట్, సేఫ్టీని కూడా ఇవ్వాలి. ఆఫీసర్ల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెంటనే తప్పులు సరిదిద్ది, సరైన ఏర్పాట్లు చెయ్యాలని కోరుతున్నారు.

