శివాలయంలో షాకింగ్ ఘటన
AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం వీరుపాపురం ప్రాంతానికి చెందిన వడ్డే ఈరన్న అనే యువకుడు ఒక శివాలయం వద్దకు వెళ్లి, అక్కడ భక్తిశ్రద్ధలతో వెలిగించిన పవిత్ర దీపం నుంచి సిగరెట్ వెలిగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువకుడు చేస్తున్న ఈ అపచారాన్ని అతని ఫ్రెండ్స్ దానిని సరదాగా వీడియో తీసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోపై హిందూ సంఘాలు, భక్తులు అతనితో పాటు అతనికి సహకరించిన స్నేహితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



