రాజధాని పనుల్లో వేగం పెంచాలి: అమిత్ షా

AP: అమరావతి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా TDP MPలకు సూచించారు. TDP పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో MPలు ఢిల్లీలోని పార్లమెంట్‌లో అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పురోగతిపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆయనకు అందజేశారు. రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు, ఇప్పటివరకు సాధించిన పురోగతిని వారు వివరించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆర్థిక, చట్టపరమైన సహకారం అందిస్తున్నందుకు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు.



