అమెరికా వెళ్లే భారతీయులకు భారీ షాక్!

అమెరికాలో పెట్టుబడితో గ్రీన్‌కార్డ్ పొందాలనుకునే వారికి ఫీజులు భారీగా పెరగనున్నాయి. నవంబర్ 30 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. EB-5 గ్రీన్‌కార్డ్ అప్లికేషన్ ఫీజు 3 లక్షల 53 వేల రూపాయల నుంచి 7 లక్షల 31 వేల రూపాయలకు పెరగనుంది. రీజినల్ సెంటర్ ద్వారా చేసే అప్లికేషన్ ఫీజు 3 లక్షల 53 వేల రూపాయల నుంచి 7 లక్షల 54 వేల రూపాయలకు చేరనుంది. శాశ్వత నివాసంపై కండీషన్స్ తొలగించే ఫీజు 3 లక్షల 60 వేల రూపాయల నుంచి 4 లక్షల 80 వేల రూపాయలకు పెరగనుంది.



