హజ్ తరువాత జీవితం ఎలా ఉండాలి?

హజ్ అనేది ముస్లింలకు ఒక పవిత్ర ప్రయాణం. హజ్‌కు వెళ్ళినవారు తమ జీవితాన్ని కొత్తగా ఆరంభించే అవకాశాన్ని పొందుతారు. అయితే హజ్ తరువాత జీవితం ఎలా ఉండాలనేదే అసలు ప్రశ్న. హజ్‌కు వెళ్ళడానికి ముందు ఎలా ఉన్నామో, ఆ తరువాత కూడా అదే విధంగా ఉంటే ఆ యాత్ర ప్రభావం మన మీద పడలేదని అర్థం. మన మాటలను, నడవడికను, ఆలోచనలను, జీవన శైలిని మార్చడం, దైవంపై విశ్వాసం మరింత పెరగడం ఇవీ హజ్ నుంచి పొందవలసిన ప్రయోజనాలు.



