'విద్యార్థులకు వసతులు కల్పించాలి'

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చేపట్టిన దీక్షలో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని ఎస్ఎఫ్‌ఐ కార్యదర్శి కాశప్ప ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఎస్ఎఫ్‌ఐ నాయకులు నరహరి, మడివాల కృష్ణ, రాధమ్మ, బానుప్రసాద్, రాణి తదితరులు పాల్గొన్నారు.



