కాళేశ్వరం కాల్వలో ప్లాట్లు.. కొనుగోలుదారులకు షాక్

TG: మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెంగడ్డ తండాలో ఎలాంటి అనుమతులు లేకుండా SR వెంచర్ పేరుతో ప్లాట్లు విక్రయించి కోట్ల రూపాయల మోసం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్లూరి సుభాష్‌రెడ్డి సుమారు 70మందికి ప్లాట్లు విక్రయించగా, వాటిలో సగానికి పైగా కాళేశ్వరం కాల్వ పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఆరు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.



