← Back to news

మత డేటా కోరిన కేంద్రం

By Krishna· 23h ago
మత డేటా కోరిన కేంద్రం

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని డెమోగ్రాఫిక్ మార్పుల ఉన్నతస్థాయి కమిటీ (HLCDC).. రాష్ట్రాల నుంచి 15 ఏళ్ల మతపరమైన డేటా కోరుతూ 35 ప్రశ్నలు అడిగింది. పుట్టిన తేదీలు, స్కూల్, ఆస్తి వివరాలు, వాహనాలు, మత నిర్మాణాలు, ఆధార్, ఓటర్ ఐడీల్లో మార్పులు, షెడ్యూల్డ్ తెగల్లో మతమార్పిడులు, డిటెన్షన్ సెంటర్ల వంటి అంశాలపై.. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీల.. జిల్లా వారీ<a href="https://www.theclearcutnews.com/n/wU6Jouk"> సమాచారం</a> కావాలని కోరింది. రాష్ట్రాలు ఈ డేటా ఇవ్వలేకపోతున్నాయి. ఈ డేటా అడగడంపై ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి.

More in National