← Back to news

పత్తి కొనుగోళ్లపై అధికారుల కీలక నిర్ణయం

By Bala· 1h ago
పత్తి కొనుగోళ్లపై అధికారుల కీలక నిర్ణయం

రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పత్తికి క్వింటాల్‌కు 8,967 రూపాయిలు మద్దతు ధర ఉందన్నారు. పత్తిలో తేమ 12 శాతం లోపు ఉండాలని సూచించారు.

More in Local