చైనా, రష్యాలకు ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, రష్యాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు అందించినా, సైనిక సాయం చేసినా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వం అని తనకు మాటిచ్చారని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ఇరాన్‌కు మద్దతుగా లేవని తాను నమ్ముతున్నానని, ఒకవేళ సాయం చేస్తున్నట్లు తేలితే, అది వారి ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమవుతుందని హెచ్చరించారు.


