← Back to news

నల్గొండ ప్రిన్సిపల్ హత్యలో బిగ్ ట్విస్ట్!

By sahani· 19 Aug 2026· Theclearcutnews· Telangana
నల్గొండ ప్రిన్సిపల్ హత్యలో బిగ్ ట్విస్ట్!

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ <a href="https://www.theclearcutnews.com/n/nWdFsLS">రూపారెడ్డి</a> హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ దారుణానికి పాల్పడింది పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అని పోలీసులు గుర్తించారు. క్లూస్ దొరక్కుండా గ్లౌజులు వేసుకుని ప్రిన్సిపల్‌ను కత్తితో పొడిచి చంపినట్లు తేల్చారు. హత్య అనంతరం ఇంట్లోని రూ.4 లక్షల క్యాష్‌తో పరారైన ఈ ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి డీటైల్స్ ఈరోజు సాయంత్రంలోగా పోలీసులు అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.