← Back to news

KVRZP హైస్కూల్ ఛైర్మన్‌గా మేరిగ మేరీ ఏకగ్రీవం

By epuri rajaratnam· 1d ago· Thullur, Thulluru, Guntur
KVRZP హైస్కూల్ ఛైర్మన్‌గా మేరిగ మేరీ ఏకగ్రీవం

గుంటూరు జిల్లా తుళ్లూరులోని KVR ZP హైస్కూల్ విద్యాకమిటీ ఛైర్మన్‌గా మేరిగ మేరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన కమిటీ ఎన్నికల్లో ఆమెను ఛైర్మన్‌గా ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుత్తా శ్రీనివాసరావు తెలిపారు. వైస్ ఛైర్మన్‌గా తాడికొండ ప్రసాద్ ఎన్నికయ్యారు. పాఠశాల యాజమాన్య కమిటీ రెండేళ్లపాటు వీరి ఆధ్వర్యంలో కొనసాగనుంది. కమిటీలో పలువురు సభ్యులను కూడా ఎన్నుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు.

More in Local