అరెస్ట్ రీజన్ చెప్పకపోతే పోలీసులపై యాక్షనే!

పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు కారణాలను కచ్చితంగా రాతపూర్వకంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పంజాబ్‌కు చెందిన జస్కరన్ సింగ్ కేసులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ చందుర్కర్ బెంచ్ ఈ ఆర్డర్ ఇచ్చింది. ఆర్టికల్ 22(1) ప్రకారం రీజన్స్ చెప్పకపోతే అది అక్రమ అరెస్ట్ అవుతుందని, అలాంటి ఆఫీసర్లపై డిపార్ట్‌మెంటల్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు రిలీజ్ చేశాక మళ్లీ కస్టడీకి తీసుకోవాలంటే మేజిస్ట్రేట్ పర్మిషన్ తప్పనిసరి అని, తీవ్రమైన నేరాలకీ ఈ రూల్ అప్లై అవుతుందని తేల్చింది.



