బట్టల దుకాణంలో భారీ మంటలు
కర్నూలు జిల్లా ఆలూరులోని మెయిన్ బజార్‌లో వెంకటలక్ష్మి (ఎంకప్ప) బట్టల దుకాణంలో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో దుకాణంలో ఉన్న బట్టలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ సహాయంతో అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర దుకాణాలకు, పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.



