← Back to news

మృతదేహం కోసం అంబులెన్స్ సిబ్బంది గొడవ

By dk· 4 Aug 2026· మంచిర్యాల జిల్లా
మృతదేహం కోసం అంబులెన్స్ సిబ్బంది గొడవ

TG: మంచిర్యాలలో మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదమైంది. మృతుడు నాగభూషణం కుటుంబసభ్యులు శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తమకు తెలిసిన అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా, ఆస్పత్రి వద్ద ఉన్న మరో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మా అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలని తిరిగి ఆస్పత్రికి రప్పించి వాగ్వాదానికి దిగారని తెలిపారు. విషాద సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.