జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

AP: అక్రిడిటేషన్ కలిగిన అర్హత ఉన్న జర్నలిస్టు లకు ప్రతి జిల్లాలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల చిరకాల డిమాండ్‌ను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేకు వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.



