బురద రోడ్డుపై రాకపోకలు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పాత పూచిరాల గ్రామంలో రెండుకిలోమీటర్ల మట్టి రోడ్డుతో 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రేపాకగొమ్ము పంచాయతీ పరిధిలోని ఈ రహదారి కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారడంతో రాకపోకలు దుర్భరంగా మారుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని, అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.



