చేపలు పట్టేందుకు వెళ్లి కాలువలో గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గండికోట గ్రామానికి చెందిన జమ్మి అర్జున్ దొర (24) చేపలు పట్టేందుకు పురుషోత్తపట్నం లెఫ్ట్ కెనాల్ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో జారిపడగా, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత అర్జున్ దొర మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.



