రూ.35కే ఉల్లిపాయలు.. విజయవాడలో షురూ!

ఉల్లిపాయల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ప్రజలకు ఉపశమనం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని అన్ని రైతు బజార్లలో నేటి నుంచి రూ.35కే కేజీ ఉల్లిపాయలు అమ్ముతున్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డు చూపించి కుటుంబానికి నెలకు 2 కేజీలు తీసుకోవచ్చు. ప్రజల డిమాండ్ బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తెలిపారు.



