నిందితులను బానెట్‌కు కట్టిన పోలీసులు..వీడియో VIRAL
మహారాష్ట్రలోని పుణేలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో పట్టుబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు వాహనం బానెట్‌కు కట్టి తీసుకెళ్లినట్లు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు మైనర్లపై కేసు నమోదు చేశారు. పాత గొడవ కారణంగానే బాలుడిపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే నిందితులను ఇలా ప్రజల ముందుకు తీసుకురావడంపై ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా స్పందించలేదు.



