← Back to news

హోటల్ గదిలో యువతి సూసైడ్

By dk· 3 Aug 2026· విశాఖపట్నం జిల్లా
హోటల్ గదిలో యువతి సూసైడ్

AP: విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం(26) విశాఖపట్నంలోని గాజువాకలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె సన్నిహితుడు లింగాల వెంకట గణేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఓ హోటల్‌లో గది తీసుకున్న ఆమె, ఎంతకీ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తెరిచి చూడగా రషీదా బేగం స్కార్ఫ్‌తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.