కనగర్తిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు గ్రీన్‌సిగ్నల్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి టీజీ NPDCLఅనుమతులు మంజూరు చేసింది. 2.70 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంతో పాటు తరచూ ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు సబ్‌స్టేషన్ ఉపయోగపడనుంది. మంజూరుకు సహకరించిన CM రేవంత్‌రెడ్డి, మంత్రి భట్టి విక్రమార్క స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.



