డబ్బులిస్తేనే పాస్ చేస్తా!

TG: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ విభాగం పీజీ విద్యార్థులు ప్రొఫెసర్‌పై కంప్లయింట్ చేశారు. థీసిస్ రికార్డులపై సంతకాలకు ఒక్కో విద్యార్థి నుంచి 30 వేలు, ప్రాక్టికల్ పరీక్షల కోసం 20 వేలు, పాస్ చేయడానికి 2 లక్షలు అడిగారని ఆరోపించారు. విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపల్, వైద్య విద్యాశాఖ అధికారులకు కంప్లయింట్ చేశారు. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.


