శివ భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదానం

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం చిన్న రథం వద్ద ఇవాళశివ భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. మాజీ మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ మన్నెం రమేష్‌బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల మొదటి ఆదివారం భక్తులకు అన్నప్రసాదం అందించడం అభినందనీయమన్నారు. సుమారు 33 ఏళ్లుగా దాతల సహకారంతో ఈ సేవ కొనసాగుతోందని తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.



