బోటుపై అమెరికా దాడి.. నలుగురు మృతి

సెప్టెంబర్ 19న కరేబియన్ సముద్రంలో వేగంగా వెళ్లే ఓ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్న మార్గంలో ఆ బోటు వెళ్తోందనీ, తమ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా దాడి చేసినట్లు అమెరికా సదరన్ కమాండ్ తెలిపింది. ఈ దాడిలో నలుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అయితే పడవలో నిజంగా డ్రగ్స్ ఉన్నాయని చూపించే ఆధారాలను అమెరికా బయటపెట్టలేదు. లాస్ట్ ఇయర్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో అమెరికా ఇలాంటి చాలా దాడులు చేస్తోంది.



