బ్లాక్‌బక్ వేట.. 9 మంది అరెస్ట్!
TG: హైదరాబాద్‌కు బ్లాక్‌బక్ మాంసం తెస్తున్నారనే సమాచారంతో షాద్‌నగర్ పోలీసులు, SOT, ఫారెస్ట్ అధికారులు రైకల్ టోల్‌ప్లాజా దగ్గర 9 మందిని పట్టుకున్నారు. వారి నుంచి 13 కేజీల మాంసం, 315 రైఫిల్, సైలెన్సర్, టెలిస్కోపిక్ సైట్, 19 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలు, 8 ఫోన్లు, కెమెరా, టార్చ్‌లు, 28,590 రూపాయలు కూడా సీజ్ చేశారు. మరికల్ అటవీ ప్రాంతంలో బ్లాక్‌బక్‌ను వేటాడి మాంసాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని తెలిసింది.


