ములియాపుట్టు స్కూల్లో SMC ఎన్నికలు విజయవంతం!

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ములియాపుట్టులో SMC ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఈ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఎన్నికల్లో మర్రి దాసు చైర్మన్‌గా, చెట్టి ఉష వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎస్.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.



