← Back to news

సిద్దాపూర్‌లో డంపింగ్‌ యార్డుపై నిరసన

By A Srisailam· 2h ago· Kothur (Ct), Kothur, Ranga Reddy
సిద్దాపూర్‌లో డంపింగ్‌ యార్డుపై నిరసన

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో డంపింగ్‌ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ SDVP జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. GO 641 జారీ చేసి 90 రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు JAC నేతలు తెలిపారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. తొలిరోజు నవయువతకు చెందిన పలువురు దీక్షలో కూర్చున్నారు. JAC నేతలు రాంబల్‌ నాయక్‌, పినపాక ప్రభాకర్‌ పాల్గొన్నారు.

More in Local