₹500 పెన్షన్ కోసం… ఛత్తీస్ గఢ్ లో ఏమైందంటే ..?
మన ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతూ ఉంటారు కదా…! దాని ఫలితం ఏంటంటే ఛత్తీస్‌గఢ్‌లో సుఖ్మనియా భాయి అనే ఓ కోడలు 90 ఏళ్ల వయసున్న తన అత్తను వీపుపై మోసుకుని 9 కి.మీ నడిచి బ్యాంక్‌కు తీసుకెళ్లింది. కారణమేంటంటే రూ.500 పెన్షన్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్, KYC పూర్తి చేయడం తప్పనిసరి కావడం. అడవిలో కొండలు, గుట్టలు, వాగులు వంకలు దాటుకుంటూ ఆమె వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. కేవైసీ పూర్తి చేసి పెండింగ్ సొమ్ము అందజేశారు.


