సల్మాన్ ఖాన్‌కు ఏమైంది?.. హెల్త్‌పై క్లారిటీ

‘బిగ్‌బాస్ 20’ ప్రోమోలో సల్మాన్ ఖాన్ ఛాతీ పట్టుకుని బాధపడుతూ, డాక్టర్‌ను పిలవడంతో ఫాన్స్ ఆందోళన చెందారు. అయితే తనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ లేదని సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఖాజీ తూకీర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫన్ కోసం ఉపయోగించిన తీరును అర్థమయ్యేలా చేసేందుకే తాను అలా నటించానని చెప్పారు. ప్రోమోను తప్పుగా ఎడిట్ చేయడం వల్ల అసలు విషయం వేరుగా కనిపించిందని తెలిపారు. దీనిపై సల్మాన్ ఖాన్ సారీ చెప్పారు.



