ప్రాణాలను పణంగా పెట్టి చదువులు

TG: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనల మధ్య తరగతులకు హాజరవుతున్నారు. సుమారు 60ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం భారీ వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారింది. గోడలు తడిసి పగుళ్లు ఏర్పడగా, తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. 143 మంది విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త పాఠశాల భవనం నిర్మించాలని, అప్పటి వరకు విద్యార్థులను సురక్షితమైన భవనానికి తరలించాలని కోరారు.





