పెళ్లిపై త్రిష క్లారిటీ !!

సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ని హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఖండించారు. అవన్నీ అవాస్తవాలనీ , తాను సినిమాలకు దూరం కావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల హీరో తలపతి విజయ్ తో ఆమె అఫైర్ వార్తల నేపధ్యంలో సినిమాలకు గుడ్ బై కొట్టేసినట్లు వస్తున్న వార్తలను ఖండించడమే కాక, ఓ రిచ్ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకున్నాను.. ఇద్దరు బిడ్డలకు తల్లయ్యాను... ఈ తాజా అప్డేట్ తో సంతోషమేనా అంటూ తన సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.



