బస్సులో యువతిపై లైంగిక వేధింపులు.. డ్రైవర్ రియాక్షన్
బెంగళూరు పరిధిలో బీఎంటీసీ బస్సులో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జరిగింది. హెబ్బాల్ నుంచి మన్యతా టెక్ పార్క్ వైపు వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరగగా.. యువతి ధైర్యంగా నిందితుడిని చితకబాదుతూ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పింది. డ్రైవర్ ప్రవీణ్ వాహనాన్ని ఆపి ఆకతాయికి బుద్ధి చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.



