← Back to news

64 ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు పూర్తి

By @prajasevalo· 1d ago· Peapally, Peapully, Nandyal
64 ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు పూర్తి

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని 64 ప్రభుత్వ పాఠశాలల్లో School Management Committee (SMC) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. అన్ని పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా విద్యాశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు మండల విద్యాశాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

64 ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు పూర్తి

More in Local