డిమాండ్లు నెరవేరితేనే దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్!

NEET పేపర్ లీకేజీపై 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రానికి లేఖ రాశారు. "నాకు బతకాలని ఉంది, స్టూడెంట్స్ కోసం చాలా చేయాలి" అని పేర్కొంటూనే, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. పేపర్ లీక్ బాధితులకు పరిహారం, విద్యాశాఖ మంత్రి రాజీనామా, పార్లమెంట్‌లో చర్చపై హాస్పిటల్ కి వచ్చి మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రొటెస్ట్ చేసిన వారిపై కేసులు, వేధింపులు ఉండవని కేంద్రం భరోసా ఇవ్వకపోతే తన నిరవధిక దీక్ష కొనసాగుతుందని హెచ్చరించారు.



