యోగి ఆదిత్యనాథ్‌పై కెనడా హక్కుల సంఘాల పిటీషన్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు ఏడుగురు ఇతర భారతీయ అధికారులపై ఆంక్షలు విధించాలని కెనడాలోని Justice For All Canada, Canadian Forum for Human Rights and Democracy in India(CFHRDI) గ్లోబల్ అఫైర్స్ కెనడాకు పిటీషన్ ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలను ఇందులో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లు, పోలీసు హింస, టార్చర్, బుల్డోజర్ చర్యలు, అరెస్టులు ఉన్నాయని ఈ సంఘాలు ఆరోపించాయి.


