← Back to news

‘సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయింది’

By Ashok Kumar· 16 Aug 2026
‘సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయింది’

TG: రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయిందని, భారత పార్లమెంట్‌లోనే సాటి సభ్యులను ‘లుంగీ వాలా’ అని పిలవడం దారుణమని జస్టిస్ సుదర్శనరెడ్డి అన్నారు. జాతీయ పార్టీకి చెందిన దళిత నాయకుడు ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం సామజిక అన్యాయనికి దర్పణం పడుతున్నాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో HYDలోని JNTU ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆర్థిక అంతరాలు తగ్గించకపోతే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు.

‘సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయింది’

More in Current Affairs