రేబీస్ ఫ్రీ దేశం ఏదో మీకు తెల్సా

భూటాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కుక్కల ద్వారా మానవులకు వ్యాపించే రేబీస్ వ్యాధిని నిర్మూలించిన మొదటి ఆసియా దేశంగా డబ్ల్యూహెచ్‌ఓ (WHO) గుర్తించింది. 2023 జూన్ తర్వాత అక్కడ ఒక్క రేబీస్ మరణం కూడా ఫైల్ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 59,000 మంది రేబీస్ వల్ల చనిపోతుంటే, అందులో మూడో వంతు మరణాలు ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ, వ్యాక్సినేషన్ సక్రమంగా జరగకపోవడమే భారత్‌లో ఈ తీవ్రతకు కారణమని ఎక్స్పర్ట్ చెప్తున్నారు.



