Delete ఆప్షన్.. మొత్తం ఫైల్స్ పోయినట్టేనా?

ఫోన్‌లో స్టోరేజ్ నిండినప్పుడు అవసరం లేని ఫొటోలను డిలీట్ చేస్తుంటాం. Delete కొట్టగానే అవి పూర్తిగా మాయమైపోతాయని అనుకుంటాం కదా? కానీ అలా కాదు. Delete చేసినప్పుడు, ఆ డేటా ఉన్న స్థలాన్ని ఇక కొత్త డేటా కోసం ఉపయోగించుకోవచ్చని ఫోన్‌కి ఒక indication మాత్రమే వెళ్తుంది. ఆ డేటా వెంటనే మాయమైపోదు. కొన్ని సందర్భాల్లో, కొత్త డేటా ఆ ప్లేస్‌ను వాడుకునేలోపు పాత డేటాను రికవర్ చేసుకునే ఆప్షన్ ఉండొచ్చు. అయితే ఇది ఫోన్, స్టోరేజ్ టెక్నాలజీని బట్టి మారుతుంది.



