ట్రంప్‌కి ఏమైంది? ఎందుకిలా?

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ పని చేశారు. తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో గంటలోనే 34 పోస్టులు పెట్టారు. అవన్నీ AI జనరేట్ చేసిన ఇమేజ్‌లు, ఇంట్రస్టింగ్ క్యాప్షన్లతో ఉన్నాయి. వెంటనే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా.. ఇరాన్ చమురును ఎక్స్‌పోర్ట్ చేసే ఖర్గ్ ఐలాండ్ గురించి ట్రంప్ పోస్టులు పెట్టారు. పైగా బై బై ఖర్గ్ అని రాశారు. ఇరాన్ భూ భాగాన్ని నాశనం చేస్తున్న ఏఐ ఫొటో కూడా షేర్ చేశారు. అలాగే చందమామ మా సొంతం అని మరో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులు కలకలం రేపుతున్నాయి.



