అక్టోబర్ నుంచి కొత్త PF రూల్స్!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్ (PF) శాలరీ లిమిట్‌ను 15వేల రూపాయల నుంచి 25 వేలకు పెంచింది. సెప్టెంబర్ 17 నుంచి ఇది అమల్లోకి రాగా.. అక్టోబర్ శాలరీస్ నుంచి కొత్త లెక్కలు అప్లై కానున్నాయి. 25వేల రూపాయల PF శాలరీపై 12 శాతం ప్రకారం నెలకు 3వేల రూపాయల PF కట్ అవుతుంది. ఈ మార్పుతో ప్రతి ఎంప్లాయీ శాలరీ నుంచి ఎక్స్‌ట్రాగా PF కట్ అవ్వదు. ఎవరికి ఎంత PF కట్ అవుతుందనేది వారి PF శాలరీపై ఆధారపడి ఉంటుంది.

