← Back to news

డేటింగ్‌.. పబ్.. కట్ చేస్తే.. చీటింగ్!

By Anusha· 1d ago
డేటింగ్‌.. పబ్.. కట్ చేస్తే.. చీటింగ్!

TG: హైదరాబాద్‌లో డేటింగ్‌ యాప్‌ ముసుగులో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ‘క్వాక్‌-క్వాక్‌’లో పరిచయమైన దివ్య అనే యువతి.. హేమంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు తీసుకెళ్లింది. అక్కడ 29,884 రూపాయల బిల్లు వచ్చింది. 10వేలు చెల్లించినట్లు ఫేక్ ట్రాన్సాక్షన్ చూపించి ఆమె వెళ్లిపోయిందని హేమంత్ తెలిపాడు. పబ్, యువతి కలిసి ఇలా చేశారని అతను ఆరోపిస్తూ, పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు రాసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

More in TG