అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఎన్నికల హామీలపై క్లారిటీ ఇచ్చారు. ఆదివారం మున్సిపల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించామని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో మంథని అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రశాంతంగా దసరా జరుపుకోవాలని కోరారు. దసరా ఏర్పాట్లను మున్సిపల్ పాలకవర్గం పర్యవేక్షిస్తుందని చెప్పారు.


