← Back to news

చిర్రావూరులో రూ.1.40 కోట్ల పనులకు శంకుస్థాపన..!

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో భారీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సహకారంతో రూ.1.40 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. మంగళవారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీ పనులు ఉన్నాయి. కాపు కళ్యాణ మండపం, శ్మశానవాటిక నిర్మాణం కూడా జరుగుతుంది. అంబేద్కర్ కాలనీలో సీసీ రోడ్డు వేస్తారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి సత్యనారాయణ, నందం అబదయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, ఆరుద్ర భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

More in Local