CITU ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు కూడా అందించడం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు.



